టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్..
జనం న్యూస్ //ఫిబ్రవరి //14//జమ్మికుంట //కుమార్ యాదవ్.. రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బి ఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ముగిస్తున్న ఇప్పటివరకు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో పూర్తిస్థాయిలో విప్లమైందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విద్యారంగాన్ని అన్ని రంగాల కంటే మెరుగ్గా ఉంచుతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో విద్యార్థులను పట్టించుకోలేని పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి విద్యను కొనసాగిస్తున్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టే లక్షల బడ్జెట్లో కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అయితాయని వాటిని కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుందన్నారు . ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చి ఫీజులు చెల్లించాలని లేకపోతే హాల్ టికెట్లు ఇవ్వమని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఒకవైపు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కాలేజీలు మూసివేసే ధోరణిలో ఉన్నాయని దీనివలన పేద విద్యార్థులకు విద్య దూరమయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతూ గ్రామీణ ప్రాంత కాలేజీలను అడ్రస్ గల్లంతయ్య విధంగా తయారు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని దీనికి నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్న ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని రాష్ట్రంలో అతిపెద్ద వ్యవస్థ విద్యావ్యవస్థ అని అలాంటి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని లేనియెడల బి ఆర్ ఎస్ వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అనిల్ రాకేష్, శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు