
జనం న్యూస్ ఏప్రిల్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏ బ్లాక్ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక హేమ దుర్గ భవన్లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.ఈ వేడుకలకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, నాగిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సన్మానించి ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని, నిబద్ధతతో పనిచేస్తూ సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న నాగిరెడ్డి, పార్టీలోని యువతకు, నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి, పార్టీ అభివృద్ధికి మార్గదర్శకుడిగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, పుష్ప రెడ్డి, తూము వేణు, ప్రకాష్ ముదిరాజ్, రాజేందర్, రాము, అస్లాం, కొండల్, కుమారస్వామి, వినోద్, అక్బర్, జగదీష్, సాయి తులసి తదితరులు పాల్గొని నాగిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.