
జనంన్యూస్. 25. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
కాలయాపన చేయకుండా దొడ్డు రకం వరి ధాన్యంను కొనుగోలు చేయాలి. ఏఐయూకెస్ - సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ ల డిమాండ్. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతంగాన్ని ఆదుకోవాలని,కాలయాపన చేయకుండా దొడ్డు రకం వరి ధాన్యంను కొనుగోలు చేయాలని సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయూకెస్) రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో దొడ్డు రకం వరిధాన్యం కొనుగోల్లు మందకోడిగా వ్యవహారిస్తున్నారన్నారు.జల్లాలో ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి, ఇందల్ వాయి, డిచిపల్లి, ఆర్మూర్ జక్రాన్ పల్లి, బీంగల్, మోర్తాడ్, ఎర్గట్ల, కమ్మర్ పల్లి మండలాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వాన వల్ల విపరీతంగా వరి ధాన్యం - మొక్కజొన్న తో పాటు టమాటా, మిర్చి, నువ్వు పంట, మామిడి తదితర పంటలు కొన్ని చోట్ల 50% శాతం మరి కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. అరుగాలం కష్టపడ్డ రైతాంగం చేతికి వచ్చిన పంట వడగండ్ల పాలు కావడంతో ఆర్థికంగా నష్టపోయిన రైతాంగం "అన్నామో రామచంద్ర " అనాల్సిన దుస్థితి నెలకొన్నదని వారు అన్నారు. పంటలతో ఎంతో కొంత ఆదాయం పొందుదాం అని చూస్తున్న రైతులకు ఏమాత్రం ఆదాయం కాదు కదా కనీసం చిల్లి గవ్వ రాని దయనియనైనా పరిస్థితి దాపూరించిందన్నారు. చేతికోచ్చిన పంట కళ్ళేదుటే రాళ్ళ పాలు అవ్వడం తో రైతులు అప్పుల పాలు అయ్యే దుస్థితి ఉందని,అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారిస్తూందన్నారు. అసలు నష్ట పరిహారం అందించడంలో ముందుకు రావడం లేదని. ఇలా రైతు పకృతి వల్ల అనేకసార్లు పంటలు నష్ట పోయిన ఆదుకుంటాం అని ప్రకటనలు ఇవ్వడం తప్ప, హామీ ఇవ్వడం తప్ప ఆదుకున్న పాపాన పోలేదు. పంటల భీమా ఉన్న అది పేరుకు మాత్రమే ఎన్నది. దానివల్ల రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదు. మండలం యూనిట్ గా తీసుకోవడం తో రైతులకు అది ఉన్న వృధా అన్నట్టుగానే ఉంది. రైతును యూనిట్ గా తీసుకుంటే రైతుకు అలా కొంచెం పహారం అందేది. కాబట్టి రైతు యూనిట్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులు దాన్యం, మొక్కజొన్న కొనుగోలు లో కల్లాల పై ధాన్యం పోసి కొనే వారి కోసం ఎదిరి చూపులు చూడాల్సిన దిస్థితి ఏర్పడింది. ఏ గ్రామాన్ని చూసిన వారిధాన్యంతో నిండి ఉన్న పరిస్థితియే కనిపిస్తుంది. కొనేవాడు లేడు. ప్రభుత్వం అయినా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లో తాత్సరం చేస్తుంది. ఒకవైపు వడగండ్ల తరుముకొస్తుంటే ధాన్యం తడిసిముద్ద అవుతున్నాయి. ఇవి చాలావన్నట్టు దొడ్డురకం వరిధాన్యంను ఎవ్వరు కొనక రైతులు అయోమయంకు గురి అవుతున్నారు. దొడ్డు రకం వరి ధాన్యంను కొనుగోలు చేయాలి అంటే 3నుండి 4కిలోలు ధాన్యంను కట్ చేసి తీసుకుంటాం అని రైతులను బెదిరించి తీసుకుంటున్నారు.కావున వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతంగాన్ని యుద్ధప్రత్తిపాధికన అందించి, వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంధ్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి అందించాలి అని, దొడ్డు రకం ధాన్యంను కూడా కోనేలా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం.కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, AIUKS రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్,AIUKS జిల్లా ప్రధానకార్యదర్శి బి బాబన్న AIUKS జిల్లా కార్యదర్శి రిక్క దామోదర్, AIUKS జిల్లా కార్యదర్శి బి కిషన్, జిల్లా కోశాధికారి నాయకులు ఎం లింబాద్రి, సిహెచ్ పోశన్న తదితరులు పాల్గొన్నారు.

