
జనంన్యూస్. 25.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన సందర్బంగా నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ డిపో 1 కి వెళ్లి ఆర్టీసీ జేఏసీ నాయకులతో, కార్మికులతో మాట్లాడుతూ మొన్న ఆర్టీసీసమ్మెలో కార్మికుల వద్దకు వచ్చి వారి డిమాండ్లను విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, పలు చర్చల తర్వాత డిమాండ్లకు ఆమోదం తెలిపిన సందర్భంలో హర్షం వ్యక్తపరుస్తూ, కెసిఆర్ ప్రభుత్వం RTCలో యూనియన్లని తీసేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూనియన్లను ప్రవేశపెడుతున్నదని అలాగే అతి త్వరలో యూనియన్ ఎలక్షన్స్ కూడా RTCలో నిర్వహించబడతాయని,2021 పి ఆర్ సి 11% వేతనాలు పెంచడానికి అంగీకారం కుదిరిందని, RTC కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగిందని, హైదరాబాదులో ఉన్న ఉద్యోగులను ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అనేది నిలుపుదల చేస్తున్నారని తెలిపారు. RTC లో ఈ పెంచిన పనిభారాలు తగ్గించబడతాయని చట్టం ప్రకారం RTC వారికి కూడా అందరిలాగా 8 గంటల పని సమయం వర్తిస్తుందని, 12 గంటలు పని ఉంటే స్పెషల్ ఆఫ్ లు ఇవ్వబడతాయని తెలిపారు.ఇవేగాక ఇంకా RTC డిమాండ్లలో, 30 వరకు ఆమోదం తెలుపుతూ ప్రజాప్రభుత్వంలో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటుందని ఈ సందర్బంగా మాట్లాడారు.
