
సమస్యలు తెలుసుకునేలోపు అధికారుల బదిలీపై విమర్శలు
కొత్త కలెక్టర్ అయిన తమ సమస్యలను పరిష్కరిస్తారా…
కొత్తగా వచ్చిన కలెక్టర్ జైన్ పైనే కోటి ఆశలు
జనం న్యూస్ 27 ఏప్రిల్ 2026
సంగారెడ్డి : ఒక జిల్లా కలెక్టర్‌గా జిల్లాపై పూర్తి అవ గాహన కలగాలంటే కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుంది. కానీ అంతలోపే అధికారులు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయడంతో సామాన్య ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకు నేందుకు దరఖాస్తులు పెట్టుకున్న వాటిని పరిష్కరించే అవకాశం మాత్రం కలెక్టర్లకు ఇవ్వడం లేదని స్పష్టమవుతుంది. తాజాగా జిల్లా కలెక్టర్ గా పని చేసిన ప్రావీణ్య గత ఆగస్టు చివరి వారంలో జిల్లా కలెక్టర్‌గా వచ్చారు సంగారెడ్డికి. ఆమె వచ్చి కనీసం ఏడు నెలలు కూడా తిరగలేదు. అందులో పంచాయతీ ఎన్నికల తో పాటు ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అత్యధిక సమయం కేటాయించారు. దాంతోపాటే ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది. కనీసం వారి సమస్య ఏమిటి అని క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసే లోపే బదిలీ వెయిట్ పడుతుంది. దీంతో సామాన్య ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి. అందుకనేమో కొందరు నిరుపేదలు కలెక్టర్ ఎంతమంది మారినా దూరప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయం చుట్టూ కొన్ని సంవత్సరాల పాటుగా, తిరుగుతూ ఉంటారు. దీనికి నిదర్శనమే జిల్లా కలెక్టర్ కార్యాల యంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన దరఖాస్తులు ఒక ఏడాదిలోనే 18672 రాగా 1172 దరఖాస్తులు రేషన్ కార్డులు మాత్రమే పరిష్కారం అయ్యాయి. ఇందులో ప్రధా నమైనది భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు మాత్రం ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు అని అంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం జిల్లా కలెక్టర్ బాగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి సరైన సమయం లేకపోవడం…. వచ్చిన అంశాలపై అవగాహన పెంచుకునే లోపు బదులు కావడమే ప్రధాన కారణం. ఈ కలెక్టర్ అయినా సమస్యలను పరిష్కరిస్తాడా..రాజకీయ నాయకులను దరిద్రపులోకి రానివ్వడు అన్న పేరు పొందిన నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ సంగారెడ్డి జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రతిక్ జెన్ సామాన్య ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలు తెలుసుకునేందుకే అధిక సమయం ఇస్తారని తెలుస్తుంది. రాజకీయ నాయకుల సిఫా రసులను… వారు వచ్చే తీసుకువచ్చే పైరవీ దరఖాస్తులను అసలు పట్టించుకోవడం అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తంగా జిల్లా కలెక్టర్లు ఆరు నెలల్లోనే బదిలీ చేయడంపై సామాన్య ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం అవుతుందని చెప్పవచ్చు. ప్రతిజ్ఞ ఇంతకుముందు పనిచేసిన నారా యణపేట జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్న వాదన ఉంది. ఇక్కడ ఎలా పని చేస్తారో వేచి చూద్దాం.