
జనంన్యూస్. 27. సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండల కేంద్రంలో గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ” కార్యక్రమంలో భాగంగా గోమాత సంరక్షణకు సంబంధించి ముఖ్యమైన వినతిపత్రాలు తహసీల్దార్ కి సమర్పించబడినవి.ఈ సందర్భంగా దేశం మరియు రాష్ట్ర స్థాయిలో గోమాతకు పూర్తి రక్షణ కల్పించేందుకు క్రింది ప్రధాన డిమాండ్లు ఉంచబడినవి.
గోమాత రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలి.గోమాతకు జాతీయ స్థాయిలో గౌరవం కల్పించాలి.
గోపాలన కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.తెలంగాణ రాష్ట్రంలో గోమాతను “రాజ్య మాత”గా ప్రకటించాలి.గోవుల అక్రమ రవాణా, వధపై పూర్తిస్థాయిలో నియంత్రణ విధించాలి.వినతిపత్రాలు . భారత దేశ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ కు పంపించాల్సిందిగా తహసీల్దార్ ని కోరడమైనది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోమాత మన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, గోవుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోవడం ఆందోళనకరమని అన్నారు. గోమాత ఆధారంగా సహజ వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని వివరించారు.అలాగే, గోవుల అక్రమ రవాణా మరియు వధ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, గోభక్తులు, గ్రామస్తులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.