
జనం న్యూస్ ఏప్రిల్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల
కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు .ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజాపూర్ణ నందం మాట్లాడుతూ…
“తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా 2001లో జలదృశ్యంలో ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ, 25 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అచంచలంగా ముందుకు సాగింది.
ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు సాగిన నిరంతర పోరాట ఫలితంగా 60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారు.24 గంటల విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, కల్యాణ లక్ష్మి, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో విశేష మార్పులు తీసుకువచ్చారు .అంతేకాకుండా ప్రపంచ స్థాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతులకు నీటి సమస్య లేకుండా చేశారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుళ్ళే రాజేశ్వర్, దోంచందా సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జక్కని మధుసూదన్, వడ్ల గంగాధర్, పన్నాల శ్రీనివాస్, రాజారాం నరేష్, దొర మోహన్, లింగారెడ్డి మ