
జనం న్యూస్ ఏప్రిల్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రావి ఫౌండేషన్ సెక్రటరీ పాలగుమ్మి వెంకట కృష్ణ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రతిభ, సంస్కారం తదితరాలను మెరుగు పరచడం కోసం సమరసత సేవా ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని రావి ఫౌండేషన్ సెక్రటరీ పాలగుమ్మి వెంకట కృష్ణ అన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ వారి జిల్లా స్థాయి బాలవికాస కేంద్రాల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమరసత సేవా ఫౌండేషన్ వారు దేవదాయ శాఖ ఆధ్యర్యంలో టిటిడి ఆర్థిక సహాయంతో ఎస్సీ, ఎస్టీ మత్యకార పల్లెలలో దేవాలయలు నిర్మించి ఆయా సామాజిక వర్గాలలోని యువకులకు టిటీడి లో అర్చక శిక్షణ ఇప్పించి నిత్య పూజలు చేయిస్తూ అదే పల్లెలలో సామాన్య విద్యను అభ్యసిస్తున్న పిల్లలలో ప్రతిభ, సంస్కారం తదితరాలను మెరుగుపరచటం కోసం స్థానిక విద్యా వంతులతో బాల వికాస కేంద్రాలు (సాయంత్రం బడి) నడుపుతున్నారు. జిల్లాలో కూడా దేవాలయాల కేంద్రంగా నడుపుతున్న బాలవికాస్ జరగుచున్నవి. విద్యార్థుల వార్షికోత్సవం అయినవిల్లి మండల పరిధిలోని నల్లచెరువు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. కాట్రేనికోన మండలం, వలసల ఉప్పలగుప్తం మండలం, ఏటిమెరక అల్లవరం మండలం, దేవగుప్తం, కొత్తపేట మండలం, వానపల్లి పి. గన్నవరం మండలం పరిధిలో పోతవరం అమలాపురం మండల పరిధిలో, రోళ్ళపాలెం, మలికిపురం మండలం గూడపల్లి, పల్లిపాలెం అమలాపురం మండలం వన్నె చింతలపూడి అయినవిల్లి మండలం, నేదునూరు అశోక్ నగర్ మొదలైన బాల వికాస కేంద్రాల నుండి 200 మంది విద్యార్థులు, మాతాజీలు, విద్యార్థుల తల్లిదండ్రులు విచ్చేసారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా రావి ఫౌండేషన్ సెక్రటరీ పాలగుమ్మి వెంకట కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థులు విద్య తో పాటు సంస్కారాన్ని అందించడానికి సమరసత సేవా ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడారు. ఈ పాఠశాలలు మరింత పెరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి జిల్లా బిజెపి ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణగుప్త (నానాజీ) గనిశెట్టి వెంకటేశ్వరరావు సన్నిధిరాజు వీరభద్రశర్మ తదితరులు పాల్గొని ఈ బాలవికాస్ కేంద్రాలను మరింత విస్తృత పరచాలని సూచించారు పిల్లలకు చక్కని సంస్కారాలు నేర్పుతున్న మాతాజీలను అభినందించడం జరిగింది సమరసత సేవా ఫౌండేషన్ గోదావరి విభాగ్ ప్రచారక్ బండ్ల రామ్ శంకర్, జిల్లా ప్రచారక్ కె. ధర్మారావు, జిల్లా కమిటీ సభ్యులు ఆరళ్ళపల్లి ముత్యాలరావు, జ్యోతి ప్రభావతి, కటికదల రాంబాబు, అయినవిల్లి కమిటీ సభ్యులు వాసంశెట్టి కార్తీక్, అశోక్ నగర్ కోదండ రామస్వామి ఆలయ అర్చకులు అంబటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గంగా భవాని దంపతులు వలసల స్కూల్ పిల్లలకు పుస్తకాలు బహుమతిగా అందించడం జరిగింది.
