
బిచ్కుంద ఏప్రిల్ 21 జనం న్యూస్
భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, బిచ్కుంద మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్. అనంతరం దేశ మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత కేసీఆర్:
కేసీఆర్ 14 ఏళ్ల నిరంతర పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత విద్యుత్ మరియు అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.కాంగ్రెస్ వైఫల్యాలు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా, పెన్షన్లు, తులం బంగారం వంటి హామీలు అమలు కాక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు, యూరియా సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. బిజెపి ద్వంద్వ నీతి. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బిజెపి, ఇప్పుడు ఇక్కడ దొంగ నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో కాంగ్రెస్, బిజెపి ఎంపీలు చేతులెత్తేశారని విమర్శించారు. తిరుగులేని శక్తి బిఆర్ఎస్:ప్రజల కష్టాల్లో తోడుండేది కేవలం బిఆర్ఎస్ పార్టీయేనని, రానున్న రోజుల్లో మళ్లీ బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ , మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగ తేలిపారు
కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

