
బిచ్కుంద ఏప్రిల్ 27 ( జనం న్యూస్)
జనగణన--2027 కు సంబంధించిన మూడవ విడుత 50 మంది (ఎన్యూమరేటర్స్) కు సూపర్వైజర్లకు బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో శిక్షణ తరగతులు బిచ్కుంద జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో శిక్షణా తరగతులు సోమవారం రోజు జనగణన సెన్సెస్ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణనలో ఎన్యూమరేటర్స్ పాత్ర కీలకం అని, గృహ గణన, గృహ జాబితా తయారు చేయడం చాలా ముఖ్యమైన మొదటి కర్తవ్యం అని చాలా పకడ్బందీగా తప్పులు లేకుండా చేయాలని అన్నారు.మొదటి సారీ పేపర్ వాడకుండా మొబైల్ యాప్ ద్వారానే జనగణన జరుగుతుంది అన్నారు.సహాయ జనగణన సెన్సెస్ అధికారి మాట్లాడుతూ గ్రామాలలో ఇండ్ల జాబితా తయారు చేయడంలో, గ్రామ వివరాలు నమోదు చేయడంలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు సహకరిస్తారని వారి సహకారంతో తప్పులు లేకుండా జనాభా లెక్కలు తయారు చేయాలని తెలిపారు.మొదటి దశలో ఈ క్రింది విధంగా వివరాలు నమోదు చేస్తారు.ఇళ్ల జాబితా ప్రాంతంలో ఉన్న అన్ని ఇళ్లను గుర్తించి, వాటి వివరాలు నమోదు చేయడం. (గృహ గణన)
ఇళ్ల సంఖ్య, నిర్మాణం, సౌకర్యాలు (నీరు, విద్యుత్, మరుగుదొడ్డి మొదలైనవి) గురించి సమాచారం సేకరించడం.ఈ శిక్షణా సిబ్బంది మాస్టర్ ట్రైనర్ లు పాల్గొన్నారు.

