
(జనం న్యూస్ ఏప్రిల్ 27 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్)
భానుడు భగ్గు మంటున్నాడు. ఉదయం తొమ్మిదింటి నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రహదారులు జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు. మునగాల మండల వ్యాప్తంగా ఐదురోజులుగా మండలంలో భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత,వడగాలులతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు.అంతే కాకుండా ఉష్ణోగ్రతకు వన్యప్రాణులు అల్లాడి పోతున్నాయి.మూడు రోజులు గా మండలంలో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ తో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,డీ హైడ్రేషన్‌కు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో కొన్ని రోజులు ఇలాగే ఉంటుందని అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.