
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28
సెల్ 9550978955బి.సి యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు.నర్సరావు పేట ఏప్రిల్ 27 మండలంలోని పసుమర్రు గ్రామంలో తమ పూర్వికుల ఆస్తి వారసత్వ ప్రకారం తమకు రిజిస్టర్ ద్వారా సంక్రమించాయని బి.సి యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అధికారులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 9సెంట్లు నా చెల్లికి 4 సెంట్లు మొత్తం 13 సెంట్లు స్థలము 1917,1959, 2015 సంవత్సరాలలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ స్థలము మాది అని కొంతమంది అక్రమాదారులు చెప్పడమే కాకుండా నడకదారి బాట ఉందని, డ్రైనేజ్ కాలువ ఉందని అంటున్నారు.నేను ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వెళ్లడం వలన పసుమర్రు గ్రామ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న అరుణాచలం ఉన్నప్పుడు నడక దారి బాట కావాలని ఆ రోజుల్లో మా తండ్రిని అడగడం వలన సరే అని చెప్పాడం జరిగిందని, దాన్ని ఆసరాగా చేసుకోని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు తగిన న్యాయం చేయాలన్నారు.