
మద్నూర్ తహసీల్దార్ ఎం డి ముజీబ్_
మద్నూర్ ఏప్రిల్ 28 జనం న్యూస్
భరత దేశంలో మనిషికి ఇన్ని హక్కులు ఉన్నాయంటే అది డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వల్లనే అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ అన్నారు. మంగళవారం మహనీయుల జయంతి వారోత్సవాల ముగింపు సందర్భంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమాన్ని లచ్చన్ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తహసీల్దార్ ఎం డి ముజీబ్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల పోరాటం, త్యాగాల వలన సమాజంలో ఇన్ని హక్కులు పొందుతున్నమన్నారు. అంబేద్కర్, సావిత్రి బాయి, పూలే లు ఈ దేశంలో రాజ్యాంగాన్ని అందించి, అంటరానితనం ను రూపుమాపడానికి, విద్య ద్వారానే విజ్ఞానం, ఙ్ఞాన సంపద వస్తుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది అని ఇన్ని హక్కులు సాధించి ఇచ్చిన మహనీయులను రోజు గుర్తు చేసుకున్న తక్కువనే అన్నారు. సామాజిక రుగ్మతలు తగ్గాలంటే అది విద్యా ద్వారానే సాధ్యపడుతుందని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే మేము ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేశారు. అనంతరం తహసీల్దార్ ఎం డి ముజీబ్ ని మరియు మండల గిర్దావర్ ఏం శంకర్ ని ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు.
