
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955
ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యల్ని ప్రజలు హర్షించరనే వాస్తవాన్ని వైసీపీ గ్రహించాలి ప్రత్తిపాటి
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మ నందరెడ్డి వాహనశ్రేణిపై వైసీపీ కార్యకర్త బీరుసీసాతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు అన్న అక్కసు, ద్వేషంతోనే వైసీపీ మూకలు టీడీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నించాయి. మిట్టగుడిపాడుకు చెందిన షేక్ సైదా దుడుకు చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ప్రజా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని, ఉద్దేశపూర్వకంగానే సైదా సీసా విసిరి ఉంటే, అతను కచ్చితంగా శిక్షార్హుడే . వైసీపీ శ్రేణులు ఈ విధమైన చర్యలతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి, తమ రాజకీయ కుట్రలు అమలుచేయాలనే ఆలోచనలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకోవు. దాడులు, దుశ్చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తాయి. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనల్ని ప్రజలు హర్షిస్తారు కానీ, హింసాత్మక విధానాల్ని కాదనే వాస్తవాన్ని వైసీపీ శ్రేణులు గ్రహించాలి అని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.