

జనం న్యూస్ 29 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాల నిధులు, పథకాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు పై ప్రత్యేక దృష్టి ప్రోటోకాల్ ఉల్లంఘన అంశంలో అధికారుల తీరు పై మండిపడ్డ ఎంపీ డీకే అరుణ. ఈ రోజు మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్ పర్సన్, ఎంపీ డీకే అరుణ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన అర్హులకు అందినప్పుడే ఆయా పథకాల లక్ష్యం నెరవేరుతుందని, అభివృద్ధి పనులు అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తేనే జిల్లా సమగ్ర అభివృద్ధి జరుగుతుందని అందుకు అధికారులు,ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలోని ప్రజల పరిష్కారం చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పన,ఇతర అవసరాలు తెలుసుకొని వాటికి తగినట్లుగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా నిధుల సద్వినియోగం అవుతాయని అన్నారు పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి,క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలు పరిశీలించి పథకాలు మంజూరు చేయాలని అధికారులకు ఎంపీ డీకే అరుణ సూచించారు. కేంద్ర ప్రభుత్వం పథకాల పై క్షేత్ర స్థాయిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని, వాటి ద్వారా మరింత మంది ప్రయోజనాలు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యవసాయ పరికరాలు,యంత్రాల సబ్సిడీ మంజూరు అయిన యూనిట్లు, మరియు నాచురల్ ఫామింగ్ నేషనల్ మిషన్ ద్వారా రైతుల వ్యవసాయ భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డుల అందజేత, సహజ వ్యవసాయం పై అవగాహన, శిక్షణ, ఉపయోగించాల్సిన సహజ ఎరువు పై అవగాహన కు సంబంధించి నిర్వహించిన క్యాంప్స్ వివరాలు వ్యవసాయ అధికారులు ఎంపీ డీకే అరుణ గారికి వివరించారు ఆయిల్ తోటల విస్తరణ, ఆర్గానిక్ ఫామింగ్ ద్వారా కూరగాయల ఉత్పత్తి, వరి, కందులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. కూరగాయల పందిరి తోటలకు కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు సబ్సిడీ అందిస్తుందని దీనిని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు.అంగన్వాడీ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిగా కేంద్ర నిధులతో చేపడుతుందని, సమీకృత మరుగుదొడ్లు, వ్యక్తగత మరుగుదొడ్ల నిర్మాణం దరఖాస్తు చేసుకున్న అందరికి మంజూరు చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 10,163 కేంద్రాలలో పక్కా భవనాలు లేని 465 అంగన్వాడీ కేంద్రాలకు భావనలను మొదటి ప్రాధాన్యతలో మంజూరు చేసి,త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని.. జిల్లాలో అంగన్వాడీ పక్క భవనాలు వంద శాతం ఉండే లక్ష్యంతో పనిచేయాలని అన్నారు. జిల్లాలో వివిధ రకాల పెన్షన్ అప్లికేషన్ సుమారు 17వేలు పెండింగ్ లో ఉన్నాయని.. అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటి మంజూరులో జరుగుతున్న జాప్యం ఎందుకని అధికారులను, ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వలేదని.. వచ్చే విడతలో మంజూరు అయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు.స్వయం సహాయక బృందాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రుణ సౌకర్యాల ద్వారా జరుగుతున్న లబ్ది గురించి ఆరా తీశారు.. స్త్రీ నిధి రుణాలు,ఇతర రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారాల గురించి ఆరా తీశారు. స్కూల్ యూనిఫామ్ స్ట్రిచింగ్ యస్ యచ్చ్ జి లకు ఇవ్వడం ద్వారా ఉపాధి లభిస్తుందని.. వారికి శిక్షణ ఇప్పించాలని, మరింతమంది ప్రోత్సహించాలని అన్నారు. నిరుపేదలకు నిష్పక్షపాతంగా ఇండ్ల మంజూరు చేయాలని ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పేదలకు పార్టీల ముద్ర వేయడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అందిస్తున్న నిధులు అందుతున్న తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకు అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం పథకం ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, టాయిలెట్స్ నిర్మాణం చేపడుతుందని జిల్లాలో ఎక్కడెక్కడ అవసరం ఉందనేది ముందస్తుగా వివరాలు అధికారులు సేకరించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు పీఎం మత్స్య సంపద యోజన ద్వారా రిజర్వాయర్లలో చేపపిల్లల పంపిణీకి కేంద్రం వంద శాతం సబ్సిడీ ఇస్తుందని వాటికి వస్తున్న నిధుల పై ఎంపీ డీకే అరుణ గారు ఆరా తీశారు.చేనేత కార్మికులకు అందుతున్న.. రుణ సౌకర్యం, రుణమాఫీ, చేనేత కార్మికులకు భీమా, పెన్షన్ వంటివి అందేలా చూడాలని అన్నారు అంతేకాక పంచాయతీ రాజ్, విద్య,వైద్యం,వ్యవసాయ రంగాలలో వృద్ధి కోసం పై సుదీర్ఘంగా సమీక్ష చేశారు మహబూబ్ నగర్ పట్టణం పరిసరాలలో వస్తున్న భారత్ మాల రహదారి పనులను వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి వినతి పత్రం అందుకొని, అధికారులతో ఎంపీ డీకే అరుణ,కలెక్టర్ కుష్బూ గుప్తా జాతీయ రహదారుల అధికారులతో చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు అన్వేషించాలని అధికారులకు సూచించారు. అంతేకాక మహబూబ్ నగర్ పట్టణంలోని వీరన్నపేట,బోయపల్లి గేట్, హనుమాన్ నగర్ లలో రైల్వే రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భూసేకరణ మార్కెట్ రేటు ప్రకారం చేయాలని, స్థానికులకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రైల్వే అధికారులతో ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ కుష్బూ గుప్తా గారు కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో దిశ కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలెక్టర్ కుష్బూ గుప్తా అదనపు కలెక్టర్లు,జిల్లా అధికార యంత్రాంగం, మహబూబ్ నగర్ మేయర్ మమత కార్పొరేటర్లు కిరణ్ కుమార్ రెడ్డి, జ్యోతి, బీజేపీ నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్ కరుణాకర్ రెడ్డి నవీన్ రెడ్డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.