
జనం న్యూస్ 29 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) పదో తరగతి ఫలితాల విడుదల నేపథ్యంలో ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, సీఐ పులి రమేష్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఫలితాలు జీవితాంతం ఉండవని,ఇవి కేవలం ఒక చిన్న పరీక్ష మాత్రమేనని విద్యార్థులకు భరోసా కల్పించారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినట్లు భావిస్తే,అది జీవితానికి అంతం కాదన్నారు. సప్లిమెంటరీ పరీక్షల ద్వారా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. నిరుత్సాహపడవద్దన్నారు. విద్యార్థులు తమ భావాలను తల్లిదండ్రులతో,ఉపాధ్యాయులతో పంచుకోవాలన్నారు. ఒంటరిగా ఎలాంటి నిర్ణయాలు తీసు కోవద్దు. తల్లిదండ్రులు పిల్లలపై పరీక్ష ఫలితాల గురించి ఒత్తిడికి గురి చెయ్యొద్దు. ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలను ప్రేమగా ఆదరించాలని, వారి ప్రవర్తనను గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు.