
(జనం న్యూస్ ఏప్రిల్ 29 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) మునగాల మండలంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారులు సూచిస్తున్నారు. రాబోయే మూడు నుండి నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా, ఎక్కువగా నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ సూచనలు పాటించడం అత్యవసరమని వైద్యాధికారులు పేర్కొన్నారు.