
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 30 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువులకు ఇష్టమైన గురువారం పురస్కరించు కొని ఉదయం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాలకు అభిషేక స్నాన కార్యక్రమం అనంతరం అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు పుష్పార్చన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దత్త సాయికి ప్రత్యేకమైన హారతులు సమర్పించారు అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ సద్గురువులకు ఇష్టమైన అన్న సంతర్పణ కార్యక్రమానికి దాతలు అందరూ సహకరించాలని కోరారు గత 15 సంవత్సరాలుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో అన్న సందర్భంగా నిర్వహిస్తున్నామని సద్గురు సన్నిధిలో చేసే అన్నసంతర్పణ అనంతమైన ఫలితాలను ఇస్తుందని తక్షణమే గురుబలం లభించిసర్వ కార్యసిద్ధి జరుగుతుందని అన్నసంతర్పణ కార్యక్రమానికి సమర్పించిన దాతలు కుటుంబాలు ఆయురారోగ్యాలతో తగ్గుతున్నాయని తెలియజేశారు, కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు అయినవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు