
జనం న్యూస్, ఏప్రిల్ 30, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు రెండు రోజుల క్రితం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన పట్టణానికి చెందిన వివేకానంద హైస్కూల్ విద్యార్థిని, మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ కూతురు హనియ హోరిన్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పాషా మాట్లాడుతూ నిన్న విడుదల అయినా పదవ తరగతి ఫలితాలలో ఉత్తీర్లైనటువంటి తెలంగాణ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ముజీబ్, రహిమోద్దీన్, షారు, మజార్, అనష్, అబూజర్ తదితరులు పాల్గొన్నారు.