
ముఖ్య అతిథిగా సర్పంచ్ జై కుమార్
బిచ్కుంద ఏప్రిల్ 30 జనం న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో సర్పంచ్ జై కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ జై కుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రివర్యులు, ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ దార్శనికుడు సంఘ సంస్కర్త విధ్యా ప్రదాత అసమానతలు అంటరానితనం నిర్మూలన కోసం తిరుగుబాటు జెండా ఎగరేసి, బోధించు, సమీకరించు, పోరాడు అంటూ జన ప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక విప్లవకారుడు అనగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ "విద్య పొందండి, సంఘటితం గా ఉండండి, పోరాడండి" అనే ఆయన సందేశం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సాయిలు గ్రామ పెద్దలు సంజీవ్ పటేల్ రాజు పటేల్ ప్రకాష్ అశోక్ సాయిలు గ్రామ ప్రజలు గ్రామ మహిళలు కాంగ్రెస్ నాయకులు , ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.