
జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం భూదేవి శ్రీదేవి లతో శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ దంపతులు తమతమ ఇంటి నుంచి పట్టు వస్త్రాలను తలంబ్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకొని వచ్చి సమర్పించినారు. పుస్త మట్టలను వంగల పరమేశ్వర్ స్వామివారికి అందజేసినారు. వేదమంత్రాల మధ్య యాగ్నీకులు కాటూరి శ్రవణాచార్యులు ఆరుట్ల కృష్ణమాచారి స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణ అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సైనా రెడ్డి కృపాకర్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేశ్వరరావు సామల సూర్య ప్రకాష్ మంత్రి రాజు అనుకారి అశోక్ మార్త సుమన్ జిందం మాధవ్ కంబత్తుల ప్రకాష్ రాయరాకుల సుమన్ నడిగోట్టు రాజమౌళి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..