
జనం న్యూస్ ఏప్రిల్ 30 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) పదోతరగతి ఫలితాలలో ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని వి.అశ్విత 587 మార్కులతో మండల టాపర్ గా మొదటి స్థానంలో నిలిచింది. 575 మార్కులతో నబిహా కౌసర్, 574 మార్కులతో పి పూజ, ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచారు. అలాగే 572 మార్కులు బి భావన, 570 మార్కులు కే శివాని, 566 మార్కులు ఈ కౌశిక్, 560 మార్కులు సిహెచ్ విశ్వతేజ, 551 మార్కులు, 551 మార్కులు ఏం సోనీ లకు వచ్చాయి. మండల స్థాయిలో ముందు వరుసలో వరుసగా 9 మంది శ్రీ చైతన్య విద్యార్థులు ఉండడం గమనారం. 43 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 27 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. 100 శాతం ఫలితాలు సాధించారు. పాఠశాల ప్రిన్సిపల్ బండారి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టాపర్స్ గా నిలిచిన శ్రీ చైతన్య విద్యార్థిని విద్యార్థులను పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం పద్మాకర్, కోఆర్డినేటర్ తిరుమలరెడ్డి, అకాడమిక్ డీన్ రజనీకాంత్ లు అభినందించారు. స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు జరుపు కున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.