

జనం న్యూస్ ఏప్రిల్ 30: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బద్దం గంగారెడ్డి కుటుంబాన్ని సందర్శించి, బద్దం లింగారెడ్డి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే కల్లెడ పూరుషోత్తం కుటుంబంలో జరిగిన మరణం నేపథ్యంలో వారి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం రెడ్డి, బాల్కొండ మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్, రెండ్ల రమేష్, నాగేంద్రనగర్ సర్పంచ్ రంజిత్, రవి రెడ్డి, అశ్వాక్ బాయ్, ఎండీ మునీర్, బలే శ్రీనివాస్, రఫీ, సంజీవ్, దొబ్బల మహేష్, జంగల గణేష్, రాకేష్, నందు తదితరులు పాల్గొన్నారు.