జుక్కల్ ఫిబ్రవరి 15 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల యూత్ ప్రెసిడెంట్ సతీష్ పటేల్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో నాయకులు రమేష్ దేశాయ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.