జనం న్యూస్ ఫిబ్రవరి 15 ; కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం రాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ని మారుతి సాగర్ లు ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శిగా కోహీర్ నాగరాజు యాదవ్, కోశాధికారిగా సదా మహేష్ లను నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షులు అల్లo నారాయణ స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.మారుతి సాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే దయాసాగర్ లు త్వరలో మిగతా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. జర్నలిస్టు సంక్షేమ కోసం గత పది సంవత్సరాలుగా టీయూడబ్ల్యూజే 143 ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. కూకట్ పల్లిలో అర్హులైన జర్నలిస్టులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా, వారి సమస్యల పరిష్కారానికి మన యూనియన్ తరపున కృషి చేయాలని కోరారు