జనంన్యూస్. 15 నిజామాబాదు. ప్రతినిధి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య డిమాండ్ ధర్పల్లి గ్రామానికి చెందిన లోలం అనూష ముదిరాజ్ లోలం నరసయ్య కూతురు గత 12 సంవత్సరాల క్రితం నుంచి జానకంపేట గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు ప్రేమ పేరుతో అనూష తో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో నమ్మిన అనూష సర్వస్వము దారపోసింది. అనూషతో శారీరక సుఖాన్ని అనుభవించి గర్భవతిని చేయడంతో అనూష తనని పెళ్లిచేసుకుని ఇంటికి తీసుకువెళ్ళమని నిలదీయడంతో వదిలించుకునే ప్రయత్నం లో భాగంగా నిరాకరించిన జాన్కంపేట వినోద్. ఆయనకి ముందే మరొక అమ్మాయితో పెళ్లి అయినట్లు చెప్పడంతో మోసపోయిన అనూష తాను వినోద్ ని నమ్మి మోసపోయానని నిజం తెలుసుకున్న అనూష విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు,కుల పెద్దలు వినోద్ ను పిలిపిచ్చి గట్టిగ ఆరతీయడంతో ఆమెకు కొంత డబ్బులను సర్దు బాటు చేస్తానని విషయాన్ని పెద్దగా చేయకండి అని కుల పెద్దలను బ్రతిమిలాడటంతో సభ్యుల సమక్షంలో అనూష పూర్తి బాధ్యత తానే చూసుకుంటానని చెప్పడంమే కాక అనూషకి పుట్టే బిడ్డని ప్రేమగా చూసుకుంటానని ఒక ఇంటిని చూసి ఉంచమని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా తరచు వినోద్ అనూష వద్దకి రావడం,పోవడం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. అనూష వినోద్ మీద ఆధారపడకుండా బిడ్డని పోషించడానికి కుట్టుమిషన్, చిన్న బట్టల షాపును నడుపుతూ కొంత డబ్బును సమకూరుస్తూ జీవితం గడిపింది. ప్రేమ పేరుతో అనూషని నమ్మబలికిన జానకంపేట వినోద్ మళ్ళీ ప్రేమ పేరుతో దగ్గర అవడంతో అనూష వినోద్ బాగానే ఉంటున్న సమయంలో మరొక బాబుకి జన్మ నిచ్చింది. కొన్ని సంవత్సరాలు గడవడంతో అప్పటికే పేకాట, జూదం అలవాట్లు ఉన్న వినోద్ డబ్బులు ఇవ్వమని అనూష ని తరచు వేదించడంతో మహిళా సంఘం గ్రూప్ లో సుమారు 5 లక్షల రూపాయలు ఇప్పించింది. ఇట్టి డబ్బులు ప్రతీ నెల కొంతమేరకు చెల్లించమని అడగటంతో అనూష, వినోద్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంట్లో ఖర్చులు పిల్లల ఫీజులు చెల్లించమని కోరడంతో తరచుగా వినోద్ అనూషను కొట్టడంతో అనూష తండ్రి కి చెప్పడంతో అనూష తండ్రి బోన్ల నర్సయ్య అల్లుడు వినోద్ ను కొన్నిరోజులు కూతురు అనూషతో దూరంగా ఉండమని లేదా కొట్టడం సరికాదని కూతురిని ప్రేమగా చూసుకోమని చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ కొంతమేరకు సర్దుమర్గడంతో గత 15 రోజులుగా మళ్ళీ డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ చిన్నది కాస్త చిచ్చురేగి పెద్దగా అవడంతో ముందే పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉండగా ప్రేమ పెళ్లి పేరుతో గర్భవతిని చేసి ఇద్దరు కుమారులకు జన్మ నిచ్చిన వినోద్ అనూష ని వదిలించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని భావించిన వినోద్ ఇద్దరు కొడుకులకు ఆస్తి నుంచి పంపకం ఇవ్వాలన్న భయంతో హత్యకు పూనుకున్నాడు. అనూషనే ఉరి వేసుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించాడు. ఇంట్లో అనూష తల్లి తండ్రులు లేని సమయంలో అనూష ని గొంతు నలిపి చితక బాదుతు మెట్లపైకి ఏడ్చుకెళ్లి చంపి పైన రూంలో చీర కొంగుతో ఉరివేసి పారిపోయినట్లు అనూష కొడుకు పోలీస్ ల సమక్షంలో వెల్లడించినట్లు తెలిసింది. తండ్రి బోన్ల నర్సయ్య కూతురు కి ఫోన్ చేస్తే ఫోన్ లేపకపోవడంతో అనుమానం తో ఇంటికి వచ్చిన బోన్ల నర్సయ్య చీర కొంగుకు వ్రేలాడుతూ కనపడిన కూతురుని చూసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమ పేరుతో మోసపోయి జీవితం నాశనం చేసుకుందని పుట్టిన బిడ్డలకు తన తల్లి ఎక్కడ అని అడుగుతే ఎం సమాధానం చెప్పాలి అని అర్ధం కావడంలేదంటూ కుప్పకూలిపోయిన బోన్ల నర్సయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాల్సిందిగా అలాగే ప్రేమ పేరుతో నమ్మబలికి కిరాతకంగా ఆడబిడ్డ అనూషని ఏడ్చుకెళ్లి ఊరివేసి చంపిన మూర్కుడు జాన్కమ్ పేట వినోద్ ను కఠినంగా శిక్షించి మరొక ఆడబిడ్డలకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడవలసిందిగా పోలీస్ అధికారులను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి అఖిలభారత రైతుకుల సంఘం ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కారల్ మార్క్స్ నిమ్మల భూమేశ్వర్, సిరికొండ, ధర్పల్లి మండల కమిటీ నాయకులు వెంకట్, గడ్డం మోహన్ సిపిఐ పార్టీ మండల నాయకులు చెలిమిర నవీన్ బిజెపి పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు.