జనం న్యూస్,జనవరి 10 తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయ విస్తరణ కొరకు డ్రోన్ సహాయంతో సాంకేతిక మరియు శాస్త్రీయ విధానంలో డ్రోన్ పిచికారి కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఇందులో భాగంగా శుక్రవారం మండలంలో గల తీపర్రు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ కషాయాలను ద్రావణాలను వరి పంటలపై పిచికారి చేయించడం జరిగింది. వరి పంటలపై పురుగులు తెగులు నియంత్రణ కొరకు వ్యాప గింజల ఇంగువ కషాయాలను చాప బెల్లం ద్రావణాన్ని డ్రోన్ సహాయంతో పిచికారీ చేయించినట్లుజిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతారావు తెలిపారు.మొదటి విడతగా మండలంలో 250 ఎకరాలలో ఈవిదంగా పిచికారీ చేసేవిదంగా ప్రణాళిక చేసినట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 6 డ్రోన్స్ ద్వారా ఈకార్యక్రమం చేపట్టి నట్లు తెలిపారు.జిల్లా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ మాట్లాడుతూ వరి పంటలపై కాండం తొలిచేపురుగు రసం పీల్చే పురుగు మాగుడు మొదలగు తెగుళ్లను నియంత్రించడానికి ప్రకృతి వ్యవసాయ కషాయాలు పిచికారి చేయడం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.వరి పంటలో వచ్చు తెగిళ్ళను నివారించడంలో వేప గింజల కషాయం ,చేపల బెల్లం ద్రావణం బ్రహ్మాస్త్రము, వావిలాకు కషాయాలను జీవామృతంతో కలిపి పంటలపై పిచికారి చేయడం వల్ల ఆశించిన దానికంటే అధిక దిగుబడిని పొందవచ్చని మోడల్ మేకర్ ఉమామహేశ్వర తెలియజేశారు.గ్రామంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణ కొరకు డ్రోన్ సహాయంతో కషాయాలను రైతుల్లోనికి నేరుగా తీసుకువెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు యూనిట్ ఇంచార్జ్ మహాలక్ష్మి తెలియజేశారు.ఈకార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.