ఈడీఎం సైదేశ్వర రావు జనం న్యూస్ 15 ;ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ కొత్త రేషన్ కార్డుల సేవలు నిరంతర ప్రక్రియ అని ప్రజలు సహకరించాలని ఈడీఎం సైదేశ్వర రావు అన్నారు. ఈఎస్డి కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు కొత్తగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డ్ సేవ మరియు మీ సేవ కేంద్రాల పనితీరును పరిశీలించడానికి శనివారం ఈ డిస్టిక్ మేనేజర్ సైదేశ్వరరావు, టీజీటీఎస్ డి ఎం రఘు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మీసేవ ఆపరేటర్లందరూ వివిధ అవసరాల కోసం మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజల వద్ద నుండి అదనపు రుసుములు వసూలు చేయకూడదని, మీసేవ కేంద్రానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. ఎవరైనా నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మీసేవ కేంద్రాలలో ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1100 కి ఫోన్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీ సేవ కేంద్రాల్లో ప్రజలతో కొత్త రేషన్ కార్డులు మరియు రేషన్ కార్డుల్లో సవరణలు నిరంతర ప్రక్రియ అని అందరూ సహకరించాలని కోరారు.