జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం 144 సంవత్సరాల ప్రయాగ్రాజ్ త్రివేణి సంగం మహా కుంభమేళా విజయ దుర్గ యూత్ సొసైటీ సభ్యులు శ్రీ పైడితల్లమ్మ చిత్రపటం మరియు విజయ దుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ కేశపట్నం చంద్రిక తండ్రి స్వర్గీయులు కేశవపట్నం దుర్గారావు గారు చిత్రపటంతో పుణ్యస్నానం ఆచరించారు. విజయ దుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ చంద్రిక మాట్లాడుతూ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించడం పూర్వజన్మ పుణ్యఫలం అని కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం ఆచరించడం చాలా ఆనందంగా ఉందని శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆమె కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కేశపట్నo జయలక్ష్మి,ప్రశాంత్, కోనేటి రాము వహీధ శ్రీ, పాలొగొన్నారు..