జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి ఆర్య వైశ్యుల అభివృద్ధి కోసం పాటుపడ తామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు గ్రంథి సూర్యనారాయణ గుప్తా (నానాజీ) అన్నారు. కాట్రేనికోన గ్రామానికి చెందిన నానాజీ బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు,ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. . ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు గ్రంథి సూర్యనారాయణ గుప్తా (నానాజీ) ఎంపిక చేయడం పట్ల వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వర్తక సంఘం సభ్యులు, పలువురు అధికారులు, అభిమానుల అభినందనలు తెలిపారు.