జనం న్యూస్ జనవరి 10 గోరంట్ల మండల ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లిలో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవిరాజు స్వామి మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఉత్తర ద్వారం ఏర్పాటు చేశారు ఉత్తర ద్వారం ద్వారా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు అనంతరం శ్రీమారేమ్మ దేవి ఆలయంలో ఎస్.ఎస్. కూచిపూడి నృత్యాలయం గోరంట్ల వారి ఆధ్వర్యంలో భరతనాట్యం కార్యక్రమం నిర్వహించారు చిన్నారుల చేసిన చేసిన భరతనాట్యం భక్తులను ఎంతగానో అలరించింది భరతనాట్యంలో పాల్గొన్న చిన్నారులకు డాక్టర్ దేవిరాజు స్వామి బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ మారేమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజు స్వామి,ఎస్ ఎస్ కూచిపూడి నృత్యాలయం గోరంట్ల ప్రతాప్ రెడ్డి, పుటక శంకర, రామ్మోహన్ రెడ్డి, ధనుంజయ, హరినాద్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, ఈశ్వర. తదితరులు పాల్గొన్నారు