జనం న్యూస్ //ఫిబ్రవరి 17 ;జమ్మికుంట //కుమార్ యాదవ్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిపారు.కెసిఆర్ జన్మదిన సందర్బంగా జమ్మికుంటపట్టణం లొ జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేశి తదనంతరం మొక్కలు నాటడం జరిగింది.. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జమ్మికుంట మాజీ న్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ..గత పది సంవత్సరాలు తెలంగాణ ఎంతో అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి,కేసీఆర్ అన్నారు.రైతాంగానికి,రైతుబంధు ఇచ్చి రైతు బీమా కల్పించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అనేక గొప్ప పథకాలను తెచ్చిన మహనీయుడు కేసీఆర్ ఆని తెలిపారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్ ,మరియు సింగిల్ విండో చైర్మన్ పొన్నగంటి సంపత్, పోడేటి రామస్వామి, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు,వార్డ్ అధ్యక్షులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు.