బిచ్కుంద ఫిబ్రవరి 17 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ బాణాసంచి కాల్చి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన కేసీఆర్ పేరు చరిత్ర పుటలలో ఎల్లప్పుడు నిలిచి ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమం అధ్యక్షత తో పాటు మాజీ జెడ్పిటిసి నాల్చారు రాజు పట్టణ అధ్యక్షులు ఆవారా శీను , మైనార్టీ నాయకుడు ముఖిద్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.