జనం న్యూస్ 17.ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసిన, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత , అలుపెరగని సేవకుడు , తెలంగాణ రాష్ట్ర అభవృద్ధి ప్రదాత రైతుబంధువుడు అందరివాడు కేసీఅర్ అని అన్నారు. జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడషం ధర్మారావు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతు రావు టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మడవి బుజ్జిరావ్ కోవ నాందేవ్,తోఢసం తిరుమన్ రావు, మిశ్రం నరేష్ పెందుర్ అర్జున్, తోడసం గుణవంత్, కుమ్ర యశ్వంతరావు, సలీం రమేష్, గేడం యశ్వంతరావు, ఆత్రం గణపతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.