మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనార
జనం న్యూస్ ఫిబ్రవరి 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మునగాల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిల్లంచర్ల హరికిషన్ జ్ఞాపకార్థం వారి పుట్టినరోజు సందర్భంగా హరి మిత్ర మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ అన్నారు.సోమవారం హరికిషన్ పుట్టినరోజు సందర్భంగా హరి మిత్ర మండలి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నందు పరువురికి స్వీట్స్ పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ,మరియు మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ శివారులో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో బియ్యం కూరగాయలు మరియు నిత్యవసర వస్తువులు పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. హరికిషన్ అనారోగ్య సమస్యతో మరణించిన తర్వాత తన తోటి స్నేహితులు మిత్ర మండలి గా ఏర్పడి ప్రతినెలా ఏదో ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, హరికిషన్ పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమంలో అనాధలకు వృద్ధులకు ఒకరోజు భోజనం అందించాలన్న ఉద్దేశంతో వారికి కావలసిన నిత్యవసర వస్తువులు బియ్యం కూరగాయలు పండ్లు,స్వీట్స్ అందించి సేవ చేయటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యాల సందర్భంగా అనాధల వృద్ధుల ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో హరికిషన్ మిత్రమండలి సభ్యులు మునగాల పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, కాసర్ల రంగన్న, నల్లపాటి నాగరాజు, చీకటి శ్రీను, నల్లపాటిశంకర్, లింగంపల్లి నాగబాబు, ఎస్ కే సైదా,నాగేశ్వరరావు, లక్ష్మణ్ ,సతీష్, నారగానివెంకన్న, తదితరులు పాల్గొన్నారు.