కోట్లు విలువ చేసే ఎన్ఎస్పి భూములను అమ్ముకుంటున్న అక్రమార్కులు
జనం న్యూస్ -ఫిబ్రవరి 17- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ నాలుగవ వార్డులోని ఎన్ఎస్పి కి సంబంధించిన ఖాళీ స్థలాన్నిదర్జాగా కబ్జా చేసి అమ్ముకున్న ఆక్రమార్కులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి మిన్న కుంటున్న అధికారులు,మెయిన్ వాటర్ పైప్ లైన్ ని తమకనుగుణంగా మార్చివేసి ప్రైవేట్ వ్యక్తులతో వెల్డింగ్ చేయించిన అక్రమార్కులు,ఖాళీ స్థలానికి వాటర్ కనెక్షన్ కూడా ఇప్పించుకున్న వైనం , ఈరోజు బోర్ వెయ్యటానికి ప్రయత్నించడంతో పర్మిషన్ లేదని బోర్ వెయ్యటాన్ని ఆపి వేయించిన ఎన్ఎస్పీ అధికారులు, గత ప్రభుత్వంలో కూడా ఈ స్థలం విషయంలో అధికారులను బెదిరించిన రాజకీయ నాయకులు, ప్రభుత్వం మారిన రాజకీయ నాయకుల బెదిరింపులతో ఏమీ చేయలేని స్థితిలో ఎన్ఎస్పీ అధికారులు, ఇప్పటికైనా ఎన్ఎస్పి అధికారులు ఈ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి స్వాధీన పరుచుకుని గతంలో ఇచ్చిన హామీ మేరకు పార్కు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా నాగార్జునసాగర్ శాసనసభ్యులు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభుత్వ స్థల కబ్జా విషయంలో స్పందించి నాలుగవ వార్డు ప్రజలకు న్యాయం చేయాలని పార్కు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.