జనం న్యూస్ 17 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా విద్యుత్ మోటార్ చోరీ??స్మశాన వాటికలో దొంగలు పడారంటా ఆలస్యం వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన స్మశాన వాటికలో ఉన్న విద్యుత్ మోటార్ ర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. తెలిసి చేశారా తెలియక చేశారా అనేది ప్రశ్నగా మారింది. అదే విధంగా గ్రామంలో చెత్త సేకరించేందుకు ఉపయోగించే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీ టైర్లు కొత్తవి మార్చి పాతవి వేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా… స్మశాన వాటిక గేట్లు చుకోవడం వల్ల ఎవరైన ఎత్తుకెళ్తారేమో అని ముందు జాగ్రత్తగా గ్రామానికి చెందిన వాటర్ మెన్, మరో ఇద్దరు భద్రంగా తీసి పెట్టారంటూ. రేపోమాపో స్మశానవాటికలో ఫిట్ చేస్తారంటూ తేలికగా సమాధానం ఇచ్చారు. మండలాధికారికి ఫిర్యాదు చేయడంతో… గ్రామాధికారి ఇలా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు స్మశాన వాటికలో ఉన్న విద్యుత్మోటార్ ఏమైనట్లు గ్రామ సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో గ్రామాలలో పర్యవేక్షణలేక. గ్రామ పంచాయతీకి సంబంధించిన వస్తువులు దొంగలు ఎత్తుకెళ్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.జనం న్యూస్ 17 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా