పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి రెండు పడక గదుల ఇళ్ళను వెంటనే పంపిణీ
జనం న్యూస్ 17 ఫిబ్రవరి జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ .జోగులాంబ గద్వాల్ జిల్లా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి రెండు పడక గదుల ఇళ్ళను వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాటరీ పద్ధతిలో ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ వలసిందేనని అన్నారు ఇంతకుముందు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందారని,లబ్ధిదారులకు పెళ్లిలు అయ్యాయని తదితర అనేక కారణాలతో కొంతమందిని 99 మంది లబ్ధిదారులను జాబితా నుండి తొలగించడం సరైంది కాదన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగము ఆయా వార్డులో ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎంపిక పారదర్శకంగా జరిగిందని,సమగ్ర విచారణ తర్వాతనే అర్హులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారని అటువంటి వారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు ఎవరు ఒత్తిడి చేస్తే లబ్ధిదారులను ఎంపిక చేశారు, ఎవరు ఒత్తిడి చేస్తే లబ్ధిదారులను తొలగించారో ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రెండు పడక గదుల నిర్మాణం పూర్తయినప్పటికి పంపిణీలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు రాజకీయ పార్టీలు సామాజిక ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ఇప్పటికే లబ్ధిదారులు శిథిల ఇండ్లలో,అద్దెనివాసాలలో జీవనం వేల రూపాయలు అద్దెలు చెల్లించి నివసిస్తున్నారని, కొంతమంది లబ్ధిదారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాలని దశలవారి ఆందోళనలకు సిద్ధం అవుతున్నామని అందులో భాగంగా మార్చి మొదటి వారంలో 2 రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని దీక్షల సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు పోరాటాల ద్వారా మాత్రమే లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ జరుగుతుందని సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో హాజరై దీక్షలో జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ రెండు పడక గదుల ఇల్లు లబ్ధిదారులు రాజేష్ నరేందర్ గంజీపేట ఆంజనేయులు ఇమ్రాన్ జయన్న పార్వతి మణెమ్మ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలతో ఉప్పేర్ నరసింహ జిల్లా కమిటీ సభ్యులు