ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల జోలికి వస్తే, బెండు తీస
జుక్కల్ ఫిబ్రవరి 17 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సోపూర్ గ్రామం శక్తి నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఈ నెల 8వ తేదీ శనివారం రోజు కొంతమంది దుండగులు తీసుకెళ్లి కాలువలో పడేయడం జరిగింది. విషయం లుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.దైవ చింతన, ఆధ్యాత్మిక వెల్లివిరిసే జుక్కల్ నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు జరగడం రదృష్టకరమని అన్నారు. పోలీస్ అధికారులకు ఫోన్ చేసి జరిగిన దుర్ఘటనపై వేగంగా విచారణ జరపాలని,దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోట్లాది భారతీయులకు స్ఫూర్తిదాయకుడు, మరాఠా యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారి బెండు తీస్తానని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్ లో ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వస్తేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తామని హెచ్చరించారు.