జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 17 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నరసరావుపేట మండలం కోటప్పకొండలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేట శ్యాసనసభ్యులు డా"చదలవాడ అరవింద బాబు చిలకలూరిపేట శ్యాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ ముందుగా త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు అనంతరం కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా కొండ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు త్వరగా జరగవలసిన పనులను పూర్తి చేయాలనీ కోరారు తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలనీ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు.