సప్పయి కార్మికులకు యూనిఫామ్స్ ఐడి కార్డ్స్,అందజేత
జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి,మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో సత్తయ్య,ఎంపిఓ సుభాష్,సోమవారం ఆకస్మికంగా సందర్శించారు.గ్రామ సచివాలయంలోని పలు రికార్డుల రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం గ్రామ పురవీధులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వీధిలో మురికి కాల్వలతో పాటు,పిచ్చి మొక్కలను,తడి పొడి చెత్తను సేకరించి, గ్రామంలోని వీధులను పరిశుభ్రంగా ఉంచాలని సూచనప్రాయంగా సూచించారు. అనంతరం గ్రామ సచివాలయ సప్పయి కార్మికులకు ఏకరూపు దుస్తులతో పాటు, సచివాలయ గుర్తింపు కార్డులను అందించారు. నిక్కచ్చిగా పనిచేసి గ్రామంలోని ప్రతి వీధి శుభ్రంగా ఉండేటట్లు పారిశుద్ధ్య పనులు రోజు చేపట్టాలని సప్పయికార్మికులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు, సప్పాయి కార్మికులు అంబాటి గంగవ్వ, చిలుక గంగారం,ఎర్రోళ్ల నగేష్,పోశయ్య,ట్రాక్టర్ డ్రైవర్ మౌల, పాల్గొన్నారు.