అధైర్య పడొద్దు నేనున్నానంటున్న జెఎస్ఆర్..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
జనం న్యూస్ 17 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాతూరి వెంకన్న మాదిగ పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి జెఎస్ఆర్ సోమవారం రోజున భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో దామెర గ్రామానికి వెళ్లి పరామర్శించి జెఎస్ఆర్ ఈ సందర్భంగా జెఎస్ఆర్ (జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి) మాట్లాడుతూ చిన్నతనంలోనే కుటుంబ స్వలాభం కోసం కాకుండా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ స్థాపించినటువంటి దండోరా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించి జాతికి అందవలసిన ఫలాలు చివరి దశలో జరుగుతున్నటువంటి మహోన్నతమైన ఉద్యమం కోసం శ్రమిస్తున్న క్రమంలో పెరాలసీస్ వ్యాధి రావడం చాలా బాధాకరమైన విషయం అని అతి త్వరలోనే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ తో కలిసి మరోసారి వస్తామని అన్నారు అదేవిధంగా ఉద్యమ కార్యచరణ లో భాగంగా పర్యటిస్తున్నటువంటి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగతో జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి చరవాణిలో మాట్లాడి ఇవ్వగా 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మీ యొక్క శ్రమ గుర్తుందని సహాయ సహకారాలు అందించే విషయంలో ఎంతో కొంత సమకూరుస్తానని మందకృష్ణ మాదిగ హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు