జ్ఞానేశ్వర రావు కలిసిన వీరన్న చౌదరి
జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ ) తూర్పుగోదావరి జిల్లా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మధుర పూడి ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలను రూపొందించిందని రాజానగరం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి తెలిపారు విమానాశ్రం వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని వీరన్న చౌదరి తెలిపారు రాజమండ్రి మధురపూడి డైరెక్టర్ ఎస్.జ్ఞానేశ్వర రావును రాజానగరం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీన ర్ నీరుకొండ వీరన్న చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.