బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ సూచన మేరకు .ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎల్కతుర్తి మండల పార్టీ బి ఆర్ ఎస్ నాయకులు. మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో.
జనం న్యూస్ 17 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద కేక్ కట్ చేసి అనంతరం పండ్లు పంపిణీ చేశారు అలాగే కార్మెల్ స్కూల్లో పండ్లు పంపిణీ చేసిన అనంతరం సొసైటీ ఆవరణలో చెట్లు నాటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కలగానే మిగిలిపోతున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమ నాయకులుగా ముందుండి ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా తెలంగాణ కోసం సంబండ వర్గాల ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహా నాయకులు కెసిఆర్ అన్నారు సాధించిన తెలంగాణను రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు అని అన్నారు. మున్ముందు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నిండు నూరేళ్లు జీవించాలని హృదయపూర్వకంగా 71 వ జన్మదిన శుభాకాంక్షలు మండల పార్టీ పక్షాన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్, శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ మునిగడ్డ శేషగిరి, రైల్వే బోర్డు సభ్యులు యేల్తూరీ స్వామి, మాజీ ఎంపీపీ మేకల స్వప్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగెడ మహేందర్, రాష్ట్ర నాయకులు గొల్లె మహేందర్, బిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్, యూత్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు చెవుల తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సాతూరి శంకర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు మదార్, వోడితల యువసేన అధ్యక్షులు చిట్టి గౌడ్, కుర్ర సాంబమూర్తి గౌడ్, దేవేందర్రావు, వెంకటేష్ యాదవ్, అంబాల రాజ్ కుమార్, చెవుల కొమురయ్య, ప్రేమ్ సాగర్ రావు, వేముల శ్రీనివాస్, నవీన్ రావు, బాపూరావు, రవీందర్, రాజేందర్, భగవాన్ గౌడ్, సురేష్ యాదవ్, తిరుపతి, రాజారాం, ప్రవీణ్ కుమార్, సందీప్, కార్తీక్, సతీష్, మహిళ నాయకులు మేరీ, భాగ్య, అనూష, రజిత, కెసిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు