జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను సోమవారం ఎంపీడీవో సత్తయ్య,ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో పదవ తరగతిలో 117 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియంలో 48 మంది తెలుగు మీడియంలో 59 మంది విద్యార్థులు ఉన్నారు.మొత్తంలో బాలికలు 47 మంది బాలురు 60 మంది ఉన్నారు.ఈ విద్యార్థిని విద్యార్థులకు పాఠాలను బోధించడానికి పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయిని ధ్యాయులు 17 మంది,ఒక్కొక్కరు 6 మంది చొప్పున విద్యార్థులకు బోధించే కొరకై దత్తత తీసుకొని పదవ తరగతి పరీక్షల కొరకు సిద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలా పాఠాలను బోధిస్తున్నారో ఒక్కొక్కరిపై ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారో అనే విషయాల్ని అధ్యాపకులతో చర్చించారు.
రోజు ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చేలా ఈ మిగిలిన 45 రోజులు గట్టిగా చదువుకునేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుభాష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, పాల్గొన్నారు.