జనం న్యూస్ 18: ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :మండల కేంద్రంలో
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీలను మండల లోని మార్లవాయి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించారు.ఈ పోటీలలో 85 మంది క్రీడాకారులు పాల్గొన్నారు 12 మంది బాలురు 12 మంది బాలికలు ఎంపికైనట్టు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం ధర్మారావు తెలిపారు. ఈనెల 20 నుంచి 23 వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే 34వ రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారాని చెప్పారు కబడ్డీ అసోసియేషన్ సభ్యులు కనక వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ ఫిజికల్ డైరెక్టర్ హరీష్ శ్రావణ్ కోచ్ లు తదితరులు పాల్గొన్నారు