జనం న్యూస్ ఫిబ్రవరి 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మ్మిడివరంలో మంగళవారం ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు దొమ్మేటి రమణ కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పలు విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ నమూనా బ్యాలెట్ అందించి తమ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ కోరారు. ఈరోజు తార కాలేజ్ ప్రిన్సిపల్,లెక్చలర్స్ ని కలిసి బ్యాలెట్ నమూనా అందించి రాజశేఖర్ కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు, పల్లెపాలెం సచివాలయం, రాజుపాలెం సచివాలయం, తానే లంక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, ముమ్మిడివరం బాలుర హై స్కూల్ , ముమ్మిడివరం బాలికల హైస్కూల్ , ముమ్మిడివరం జూనియర్ కళాశాల,బాలాజీ విద్యాసంస్థలు, రవీంద్ర, ఐమాండ్స్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ని కలిసి రాజశేఖర్ కి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, నగర టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, పాయసం చిన్ని, నిమ్మకాయల విషు, గోదాశి గణేష్, జగతా గోవిందు, మెండి కమల, బొక్క రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, కాశి లాజర్, గెడ్డం శ్రీరామ్, రెడ్డి శ్రీను, తోత్తరమూడి జ్యోతి బాబు, బడుగు సందీప్ సాయి, శీలం వెంకటరమణ, బూరుగు కళ్యాణ్, నీతిపూడి వంశీ, బుల్లెట్ ప్రసాద్ ,గెడ్డం శ్రీనివాసరావు, జంగా మణికంఠ, సరిపెల్ల నాగరాజు, కటికదల నాని, శెట్, మొదలగు వారు పాల్గొన్నారు.