జనం న్యూస్ ఫిబ్రవరి 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారంరోజునాభారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పుట్టిన రోజును ఆంగ్ల భాష దినోత్సవంగా జరుపుకోవాలని ఆదేశాలను జారిచేసిన కారణంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు..విద్యార్థులు ఆంగ్ల భాషలలో ఉపాన్యాసాలు ఇవ్వడం,పాటలు పాడడం నాటికలు వేయడం ,క్విజ్ పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ నేటి కాలంలో ఆంగ్ల భాష నేర్చుకోవడం చాలా అవసరమని,ఉన్నత చదువులకు ఈ భాష ఎంతగానో ఉపయోగపడు తుందని,రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది అని విద్యార్థులు ఆంగ్లభాష పై పట్టు సాధించాలని మాట్లాడారు.పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరోద్దిన్,ప్రసాద్,పవన్, రాజశేఖర్. ఎస్ .శ్రీనివాస్,విజయ్, రాజ నరసయ్య,రాజేందర్,గంగాధర్, కే.శ్రీనివాస్,ప్రవీణ్ శర్మ,నరేష్, గంగమోహవ్,ట్వింకిల్,సమిత,సబిత, కొమలి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.