జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంధర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇందూరు జిల్లా అంటే కాషాయానికి అడ్డా అని, ఈ మధ్య జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ ఫలితాలు తర్వాత రాజకీయాల్లో చాలా రకాల మార్పులు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు 6 గ్యారంటీలు మరియు 420 హామీలతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా అన్న నిరుద్యోగ భృతి 3000 రూపాయలు మరియు 1 లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఇచ్చిన హామీలో భాగంగా నిరుద్యోగ భృతిని 3000 రూపాయల నుండి నుండి 4000 వేల రూపాయలకు పెంచుతామని మరియు 1 లక్ష ఉద్యోగాలను 2 లక్షలకు పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదని మండిపడ్డారు. చదువుకునే విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ కూడా అమలు కాక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని, 317 జీవో విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు విసిగిపోయారని, ఇలా పలు రకాల సమస్యలు ఉన్నాయని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించే గొంతుకలై సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గారిని మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ . బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు, బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి బిజెపి నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ గారు, బిజెపి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, జిల్లా ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.