గర్భిణీ స్త్రీ లు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..అంబాల విజయ ఆధ్వర్యంలో..
జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మంగళవారం రోజున అంగన్వాడి సెంటర్ వన్ అంబాల విజయ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పోషక విలువలు కలిగిన ఆహారం చాలా ముఖ్యమైనదని పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ప్రోటీన్లు కాలుష్యం అధికంగా ఉండే ఆహార పదార్థాల తీసుకోవాలి ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను హ్యాండ్ వాష్ ను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు తగిన నిద్ర అవసరమని రోజు రాత్రి 8 గంటలకు పడుకోవాలి పిల్లల పెంపకం ఒక సవాలు తో కూడిన ది అదే సమయంలో ఎంతో సంతృప్తికరమైన పని,పిల్లలకు సామతుల్య ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం వారి ఆహారంలో పండ్లు కూరగాయలు ప్రోటీన్స్ పాల ఉత్పత్తులు ఉండేటట్టు చూడాలని పిల్లలకు భోజనం చేసే వేళలను క్రమబద్ధీకరించాలని పిల్లలు నీరు ఎక్కువ తాగేలా చూడాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివో లు పిల్లల తల్లిదండ్రులు గర్భిణీలు బోనగిరి రమాదేవి, పాములపర్తి రత్నకుమారి, గోరింటాల దేవేంద్ర, శనిగరం స్వరూప, బొజ్జ రాణి, కందుకూరి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు